ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్

by Naveena |
ప్రభుత్వ  స్థలాలను  పరిశీలించిన కలెక్టర్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : జిల్లా కేంద్రo శివారులోని పలు ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం పరిశీలించారు. కొండారెడ్డి పల్లి చెరువు మార్గంలోని 104 సర్వే నంబర్ లో దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయం నిర్మాణం కోసం పరిశీలించారు. అలాగే సింగారం వద్ద నూతన కలెక్టరేట్ వెనక వైపున 31 సర్వే నంబర్ లోని ప్రభుత్వ స్థలాన్ని జిల్లా మహిళ సమాఖ్య భవన నిర్మాణం కోసం పరిశీలించారు. ఆయా స్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రామచందర్, డిఆర్డిఓ మొగులప్ప, అడిషనల్ డిఆర్డిఓ అంజయ్య, తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed