ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేయాలి

by Naveena |
ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేయాలి
X

దిశ, కామారెడ్డి : ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండలం పోసాని పేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇళ్ల సర్వేకు సంబంధించిన యాప్ లో లబ్ధిదారురాల సమాచారం, ప్రస్తుతం ఇంట్లో నివసిస్తున్న ఫోటో, భూముల వివరాలు, కుటుంబ వివరాలు, వితంతువులు, దివ్యాంగులు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ప్రతీ రోజూ 20 నుండి 30 ఇండ్ల వరకు సర్వే చేయాలని తెలిపారు. సర్వే పనులను వేగంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకు లింకేజీ రుణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా అర్హత కలిగిన సంఘాలకు రుణాలను వచ్చే జనవరి 31 లోగా టార్గెట్ ప్రకారం రుణాలను పంపిణీ చేపట్టాలని తెలిపారు. 250 కోట్ల రుణాలు పంపిణీ టార్గెట్ ఉందని, లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ చేయాలని తెలిపారు. అదే విధంగా రుణాల పంపిణీ తో పాటు రికవరీ వంద శాతం చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్షించాలని, రికవరుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరాచాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, డీపీఎం రవీందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed