Maruti Suzuki: మారుతీ సుజికీ కొత్త రికార్డు.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 20 లక్షల కార్లు సేల్..!

by Maddikunta Saikiran |
Maruti Suzuki: మారుతీ సుజికీ కొత్త రికార్డు.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 20 లక్షల కార్లు సేల్..!
X

దిశ,వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లో మారుతీ సుజికీ(Maruti Suzuki) కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో కార్లను అందిస్తుండటంతో చాలా మంది వీటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రజలు(Middle Class people) మారుతీ కార్లను ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాగే విదేశాలలో కూడా ఈ కంపెనీ కార్లకు మంచి క్రేజ్ ఉంది. ఇదిలా ఉంటే.. మారుతీ సుజికీ ఈ ఏడాదిలో 20 లక్షల కార్లను సేల్(sale) చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 20 లక్షల ప్యాసింజర్ వాహనాల విక్రయాలను సాధించిన మొదటి బ్రాండ్ కంపెనీగా రికార్డు క్రియేట్ చేసినట్లు తెలిపింది. 20 లక్షల కార్లలో 60 శాతం హర్యానా(Haryana)లో, 40 శాతం గుజరాత్(Gujarath)లో ఉత్పత్తి చేయబడ్డాయని పేర్కొంది. కాగా ఇండియాలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతీ సుజికీ వాటా 40 శాతంగా ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed