- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:హైవే అండర్ డ్రైనేజీ పనుల్లో కదలిక
దిశ, బాపట్ల: వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు బుధవారం ఉదయం చర్యలు చేపట్టారు. ఇటీవల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైవే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
తిమ్మరాజుపాలెం, పర్చూరు మధ్య గల సబ్ స్టేషన్ సమీపంలో వరద కాలువ లేకపోవడం వల్ల పంటలు దెబ్బతింటాయని, అండర్ డ్రైనేజీ పైప్ లైన్ సిస్టం ఏర్పాటు చేయాలని స్థానిక రైతుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే ఏలూరి సూచన మేరకు కదిలిన అధికారులు, కాంట్రాక్టర్ సంబంధిత కాజ్ వే ప్రాంతంలో రెండు లైన్ల పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. తిమ్మరాజుపాలెం ప్రక్కనే ఉన్న మరో కాజ్ వే స్థానంలో ఏర్పాటు చేయతలపెట్టిన పైపులైన్ ను తొలగించి 10 మీటర్లు వెడల్పు,3 మీటర్లు ఎత్తులో అండర్ డ్రైనేజీ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును స్థానిక రైతులు అభినందించారు.