ధర్మ సమాజ్‌ పార్టీ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష

by Naveena |
ధర్మ సమాజ్‌ పార్టీ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 18: నిజామాబాద్ లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య,వైద్యం,ఉపాధి, అర్హులైన వారందరికీ ఒక ఎకరం భూమి, నాలుగు గదుల ఇళ్లు సాధన డిమాండ్ చేశారు. ఈనెల 18 నుండి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి సుమన్ మహరాజ్ , జిల్లా అధ్యక్షుడు ఎం. మహిపాల్ మహరాజ్ లు ఇద్దరు గత మూడు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వారి దీక్షకు పలువురు మద్ధతు ప్రకటిస్తున్నారు. వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు వీరి దీక్షకు మద్దతు తెలియ జేస్తున్నారు. మూడు రోజుల నుండి దీక్షలో కూర్చున్న వారి ఆరోగ్య పరిస్థితిపై డీ ఎస్ పీ ఆందోళన నెలకొంది. ఓ పక్క అలుపెరుగక కుండా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఈ ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా పేద ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేదిలేదని, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని డీ ఎస్ పీ రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,మండలాల అధ్యక్షులు ప్రశాంత్, మురళి, శ్రీకాంత్, మహిపాల్, నిశాంత్, మహేష్ పాల్గొన్నారు

Advertisement

Next Story