- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Honda-Nissan: త్వరలో హోండా-నిస్సాన్ విలీనం!
దిశ, బిజినెస్ బ్యూరో: వాహన పరిశ్రమలో అతిపెద్ద విలీనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీలు హోండా మోటార్స్, నిస్సాన్ మోటార్స్ మెర్జర్ అవనున్నాయని సమాచారం. ఈ విలీనంతో కొత్త సంస్థ జపాన్‌కే చెందిన మరో దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టొయోటాకు గట్టి పోటీగా నిలవనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమలో నెలకొన్న పోటీని ఎదుర్కొనేందుకు ఇరు సంస్థలు తాజా నిర్ణయానికి వచ్చాయని, ఇప్పటికే విలీనంపై ఇరు కంపెనీల మధ్య చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. విలీన వార్తలతో బుధవారం నిస్సాన్ కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 24 శాతం ర్యాలీ కనిపించింది. దీనికి సంబంధించి స్పందించిన హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా.. విలీనంతో పాటు మూలధన వ్యయాలను సంబంధించిన అంశాలపై పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రాథమిక చర్చల దశలోనే ఉందని, స్పష్టత వచ్చేందుకు మరింత సమయం పడుతుందన్నారు. విలీనం జరిగితే ఇరు కంపెనీల సంయుక్త వాహనాల ఉత్పత్తి 74 లక్షల యూనిట్లకు చేరుతుంది. తద్వారా ప్రపంచంలోనే టయోటా, ఫోక్స్‌గ్యాగన్ తర్వాత మూడో అతిపెద్ద వాహన సంస్థగా నిలుస్తుంది.