MobiKwik: స్టాక్ మార్కెట్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మొబిక్విక్.. దాదాపు 60% ప్రీమియంతో షేర్ల లిస్టింగ్..!

by Maddikunta Saikiran |
MobiKwik: స్టాక్ మార్కెట్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మొబిక్విక్.. దాదాపు 60% ప్రీమియంతో షేర్ల లిస్టింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: గురుగ్రామ్(Gurugram)కు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మొబిక్విక్(MobiKwik) స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను కంపెనీ గరిష్టంగా రూ. 279గా నిర్ణయించగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE)లో 57.71 శాతం ప్రీమియంతో రూ. 440 వద్ద లిస్ట్ అయ్యింది. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(BSE)లో 58.51 శాతం ప్రీమియంతో ఒక్కో షేరుకు రూ. 442.25 వద్ద నమోదైంది. కాగా మొబిక్విక్ రూ. 572 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఐపీఓ(IPO)కు వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఓకు వచ్చిన మొదటి రోజే అనూహ్య స్పందన లభించింది. మొత్తం 1.18 కోట్ల షేర్లకు గానూ 2.17 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇక చివరి రోజుతో ఏకంగా 119 రేట్ల సబ్ స్క్రిప్షన్ అందుకుంది.

Advertisement

Next Story