One Nation- One Election: జాయింట్ పార్లమెంట్ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు..!

by Shamantha N |
One Nation- One Election: జాయింట్ పార్లమెంట్ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒకే దేశం-ఒకే ఎన్నిక(One Nation- One Election)పై నియమించిన జాయింట్ పార్లమెంట్ కమిటీ(joint parliamentary committee)లో కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi Vadra)కి చోటు దక్కినట్లు తెలుస్తోంది. ప్యానెల్‌లో ప్రియాంకను భాగం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకతో పాటు మనీష్ తివారీకి(Manish Tewari) చోటు లభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జమిలి ఎన్నికల బిల్లు పరిశీలనకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ, మనీష్ తివారీ, రణదీప్ సుర్జేవాలా, సుఖ్‌దేయో భగత్ సింగ్ పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఇండియా కూటమిలో మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ కూడా పలు పేర్లు ప్రతిపాదించింది. టీఎంసీ నుంచి సాకేత్ గోఖలే, కల్యాణ్ బెనర్జీ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన అనిల్ దేశాయ్ పేరును ప్రతిపాదించింది. ఫైనల్‌గా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే ప్రాతినిధ్యం వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. జమిలిపై రాజ్యాంగ సవరణ బిల్లును ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. పార్లమెంట్‌లో ప్రస్తుతం బీజేపీ తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అన్నిపార్టీల లోక్ సభ ఎంపీల సంఖ్య ఆధారంగా కమిటీలో గరిష్ఠంగా 31 మంది ఎంపీలు ఉండవచ్చు. ఎగువ సభ నుండి గరిష్ఠంగా 10 మంది కమిటీ సభ్యులను తీసుకోవచ్చు.

జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అణువుగా కేంద్రప్రభుత్వం 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 90 నిమిషాల చర్చ తర్వాత బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. అయితే కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో బిల్లును జేపీసీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story