- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం....యువకుడిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు
దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పుడూరు గ్రామంలో దారుణం చేసు చేసుకుంది. ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మల్యాల సీఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం పూడూరు గ్రామానికి చెందిన పెద్ది రాజశేఖర్ (33) మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధించ సాగాడు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తూ చంపుతానని బెదిరించాడు. దాంతో తల్లి, భార్య అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం మృతుని బావమరిది కడారి మహేందర్ సహాయంతో బాత్రూంలో వేసి బయట నుండి గడియ పెట్టారు. మరుసటి రోజు ఉదయం చూడగా దెబ్బలకు తాళలేక రాజశేఖర్ మృతి చెందాడు. మృతుని తండ్రి పెద్ది మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.