పేకాట స్థావరంపై పోలీసులు దాడి

by Sridhar Babu |
పేకాట స్థావరంపై పోలీసులు దాడి
X

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రూ. 10610 నగదును స్వాధీనం చేసుకున్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్​ సీఐ రాజ్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల బస్తీ లో ఏలూరి రవి అనే వ్యక్తి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేశారు.

పేకాట ఆడుతున్న నలుగురు జూదరులను, నిర్వాహకుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. రూ.10,610 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో పేకాట నిర్వాహకుడు ఏలూరి రవితో పాటు గడికొప్పుల భీమయ్య, అశోక్ నగర్ కు చెందిన ఎంఏ. నబీ, 24 డీప్ కు చెందిన ఆరెపల్లి పోశం, గ్రౌండ్ బస్తీకి చెందిన దాగం చరణ్ ను అరెస్ట్ చేశారు. నిందితులను విచారణ నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed