AP News : హోంగార్డ్స్ కు హైకోర్ట్ గుడ్ న్యూస్

by M.Rajitha |   ( Updated:2024-12-18 17:01:37.0  )
AP News : హోంగార్డ్స్ కు హైకోర్ట్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ హోంగార్డ్స్(Home Guards) కు హైకోర్ట్(High Court) శుభవార్త తెలిపింది. కానిస్టేబుళ్ల భర్తీConstable Recruitmentలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీకి చెందిన పలువురు హోంగార్డులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్ట్ విచారణ చేపట్టగా.. ఇరువైపులా వాదోపవాదనల అనంతరం నేడు తీర్పు వెలువరించింది. కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(SLPRB)కు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరువారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Next Story