- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GJEPC: నవంబర్‌లో 13 శాతం క్షీణించిన రత్నాభరణాల ఎగుమతులు
దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండటం, సుధీర్ఘకాలంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ నుంచి రత్నాభరణాల ఎగుమతులు పడిపోయాయి. ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించి వీటి ఎగుమతులు 12.94 శాతం క్షీణించి రూ. 16,763.13 కోట్లకు తగ్గాయని జెమ్ అండ్ జ్యూవెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) బుధవారం ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే నెలలో రత్నాభరణాల ఎగుమతులు రూ. 19,370 కోట్లుగా నమోదయ్యాయి. సమీక్షించిన నెలలో కట్ అండ్ పాలిష్ వజ్రాల ఎగుమతులు 39.81 శాతం క్షీణించి రూ. 5,656 కోట్లకు చేరుకున్నాయి. ల్యాబ్‌లో పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు 42.37 శాతం తగ్గిపోయి రూ. 533 కోట్లుగా నమోదయ్యాయి. అయితే, సాదా బంగారు ఆభరణాల ఎగుమతులు మాత్రం 72.12 శాతం పెరిగి 5,545 కోట్లకు చేరాయి. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరికొంతకాలం రత్నాభరణాల పరిశ్రమకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే, హాలిడే సీజన్, పెరిగిన డిమాండ్ కారణంగా ఎగుమతులు మళ్లీ పుంజుకుంటాయనే విశ్వాసం ఉందని జీజేపీసీ మాజీ ఛైర్మన్ కొలిన్ షా చెప్పారు. కాగా, బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వలంగా తగ్గాయి. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 77,840గా ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 150 తగ్గి రూ. 71,350 వద్ద ఉంది. వెండి కిలో రూ. లక్ష ఉంది.