టీచర్ల బాత్రూంలో స్పై కెమెరా.. రోజూ ఫోన్లో చూస్తూ స్కూల్ డైరెక్టర్‌ వికృత చేష్టలు

by Bhoopathi Nagaiah |
టీచర్ల బాత్రూంలో స్పై కెమెరా.. రోజూ ఫోన్లో చూస్తూ స్కూల్ డైరెక్టర్‌ వికృత చేష్టలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తండ్రి వయసులో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ మహిళా టీచర్ల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. టీచర్లు ఉపయోగించే బాత్ రూంలో స్పై కెమెరా ఏర్పాటు చేసి నీచానికి దిగాడు. టీచర్ల వాష్ రూం దృశ్యాలను చూస్తూ వికృత ఆనందం పొందాడు. ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చిన ఈ దుశ్చర్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

నోయిగా సెక్టార్ 70లో నిర్వహిస్తున్న ఓ ప్లే స్కూల్‌‌కు నవనీష్ సహాయ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. బాధ్యతయుతంగా ఉండాల్సిన వ్యక్తి నీచానికి ఒడిగట్టాడు. మహిళా ఉపాధ్యాయురాళ్ల బాత్ రూంలో స్పై కెమెరా బిగించి తన మొబైల్, కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకున్నాడు. అలా రోజూ టీచర్ల బాత్ రూం దృశ్యాలను చూస్తూ వికృత ఆనందం పొందేవాడు. అయితే ఈ నెల 10న బాత్రూంలోని బల్బ్‌ హోల్డర్‌లో స్పై కెమెరా ఉన్న విషయాన్ని ఓ టీచర్ గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని స్కూల్ కోఆర్డినేటర్‌ పరుల్‌తోపాటు డైరెక్టర్ నవనీష్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ వారిద్దరు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకోని ఆమె ఫిర్యాదును కొట్టిపడేశారు.

అనుమానం వచ్చిన టీచర్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. డైరెక్టర్ నవనీష్‌నే స్పై కెమెరా పెట్టినట్టు తేలింది. ఆన్‌లైన్‌లో రూ.22 వేలకు స్పై బల్బును కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అంతే కాదు.. డైరెక్టర్ నవనీష్ గతంలోనూ ఇలా టీచర్ల బాత్ రూంలో కెమెరాలు అమర్చినట్లు బయటపడింది. ఈ ఘటనపై మహిళా టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్ నవనీష్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు స్కూల్ కార్యకలాపాలు నిలిపివేశారు.

Advertisement

Next Story