- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో యువకుడి వీరంగం..అసలేం జరిగిందంటే ..?
దిశ,తాడ్వాయి: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకున్న ద్విచక్ర వాహనం ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వీరంగం సృష్టించింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్టు పైకి ఎక్కి దూకిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే...మండల కేంద్రంలోని పోలీసులు బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు.ఈ క్రమంలో మండల కేంద్రానికి చెందిన కిసరి గంగాధర్ అనే యువకుడి అయన బంధువు కలిసి మద్యం సేవించి బైక్‌పై వెళ్తుండగా..పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేశారు. దీంతో మద్యం సేవించాడని నిర్ధారించిన పోలీసులు ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మద్యం సేవించానని ఒప్పుకున్నయువకుడు..ద్విచక్ర వాహనం ఇవ్వాలని పోలీసులను ప్రాధేయ పడిన నిరాకరించారు. దీంతో పోలీస్ స్టేషన్ లోని ఓ చెట్టు పైకి ఎక్కి అర్ధ గంటసేపు వీరంగం సృష్టించారు. అటువైపుగా వెళ్తున్న స్థానికులు చూసి ద్విచక్ర వాహనం ఇపిస్తామని నచ్చజెప్పిన వినకపోగా...చెట్టుపై నుంచి దూకేశాడు. దీంతో పోలీసులు యువకుడిన హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ మద్యం మత్తులో వీరంగంలో ఓ అస్పత్రి కి తరలించినట్లు సమాచారం.