- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢీల్లీలో తాకట్టు పెట్టారు.. బీజేఎల్పీ నేత ఏలేటి
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రాజ్ భవన్ ముట్టడికి వెళ్లడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..సాధారణంగా కాంగ్రెస్ ఎల్పీ నేత అధ్యక్షతన ధర్నాలో పాల్గొంటారని, కానీ సీఎం స్వయంగా వెల్లడమేంటని ప్రశ్నించారు. అదానితో దోస్తీ చేసి రూ.100 కోట్లు తెచ్చుకున్నారని, రాహుల్ గాంధీ వద్దంటే వెనక్కు ఇచ్చారన్నారు. సీఎం పదవిని కాపాడుకునేందకు ధర్నా డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వనందుకే రేవంత్ ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం, రేవంత్ రెడ్డినా... రాహుల్ గాంధీనా చెప్పాలన్నారు. విదేశి కంపెనీలు ఇచ్చే నివేదికల ఆధారంగా ధర్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దేశంలోనే ఉన్నా మనసు మాత్రం విదేశాలపై ఉందన్నారు. అదానీ గ్రూప్ తో మీకున్న దోస్తీ ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.