Shridhar Babu: త్వరలో 30 వేల ఐటీ ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు

by Maddikunta Saikiran |
Shridhar Babu: త్వరలో 30 వేల ఐటీ ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 30 వేల వరకు టెక్​ ఐటీ ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు ఐటీ సర్వీస్​ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి శ్రీధర్​ బాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్​ రంజన్​ల సమక్షంలో బుధవారం తెలంగాణ సచివాయలంలో యునైటెడ్ స్టేట్స్‌లోని పలు కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఐటీ సర్వ్​ అలయన్స్ ​ నేషనల్​ ప్రెసిడెంట్​ జగదీశ్​ మోసాలీ, మంత్రి అడ్వయిజర్​ సాయి కృష్ణ, ఐటీఈసి డిపార్ట్​మెంట్ ​చీఫ్​ స్టాటజిక్​ ఆఫీసర్​ శ్రీకాంత్​ లంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి టైర్-2, టైర్-3 పట్టణాలలోనే రానున్న రోజుల్లో 30,000 కొత్త ఉద్యోగాలను ఇచ్చేలా ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకాలు చేసుకున్నాయి.

ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ ఎంఓయూను స్వాగతించారు. “ఐటీ మౌళిక సదుపాయాలు, అవకాశాలను టైర్-2, టైర్-3 పట్టణాలకు తీసుకురావడం ద్వారా ఉద్యోగాలను సృష్టించడం మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగాన్ని కూడా శక్తివంతం చేస్తున్నామన్నారు. స్థానిక శ్రామిక శక్తిని పరిశ్రమకు సిద్ధంగా ఉండేలా చేయడానికి ప్రభుత్వం నైపుణ్యం, రీ స్కిల్లింగ్ రెండింటిపై దృష్టి సాధించిందన్నారు. ఐటీ రంగంలో నూతన ఉద్యోగాలు రావడం ద్వారా హైదరాబాద్ వంటి నగరాలలో వలసలను తగ్గించడానికి సహాయపడుతుందన్నారు. ఐటీ సర్వీస్​తో ఈ భాగస్వామ్యం కోసం సమతుల్య, స్థిరమైన వృద్ధిని సాధించాలనే ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళతామన్నారు. అనంతరం ఐటి సర్వీస్ ​అలయన్స్ జాతీయ అధ్యక్షుడు జగదీష్ మొసలి ఈ సందర్బంగా మాట్లాడుతూ తమకు ఈ అవగాహన ఒప్పందం కీలకమైనదని అభివర్ణించారు. తమ సంస్థ వృద్ధి , సహకారాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తూ ఈ అవగాహనా ఒప్పందాన్ని చేసుకున్నామన్నారు. ముఖ్యంగా ఐటీ సర్వీస్​ సభ్య కంపెనీలు తమ పరిధిని విస్తరించుకోవడానికి సహకరించడానికి అవకాశం లభించిందన్నారు. టైర్-2, టైర్-3 పట్టణాలలో ప్రతిభను అభివృద్ధి చేయడం, మౌళిక సదుపాయాలకు అవకాశం కల్పించడం తమ ముందున్న కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. ఒక పక్క తాము రెండు వ్యాపారాలకు ప్రయోజనం చేకూర్చే స్థిరమైన వృద్ధిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed