Assembly : అర్ధరాత్రి అసెంబ్లీ బిజినెస్ ఎజెండాపై విపక్షాల గరం

by Y. Venkata Narasimha Reddy |
Assembly : అర్ధరాత్రి అసెంబ్లీ బిజినెస్ ఎజెండాపై విపక్షాల గరం
X

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ(Assembly)బిజినెస్ ఎజెండా(Business Agenda)ను ప్రభుత్వం అర్ధరాత్రి 12గంటల తర్వాత పెట్టడం సమంజంగా లేదంటూ ప్రతిపక్ష సభ్యులు ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధీన్ ఓవైసీ(Akbaruddin Owaisi), బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్(Palvai Harish), సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao)లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ వెంటనే చర్చ పెట్టడంపై బీఆర్ఎస్ సహా ఎంఐఎం, బీజేపీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని, అర్ధరాత్రి 12గంటల వరకు అసెంబ్లీ బిజినెస్ ఎజెండా కనిపించడం లేదన్నారు. ఒక బిల్లుపై మాట్లాడాలంటే కనీసం 12గంటల సమయం అవసరమన్నారు. ఇప్పుడే బిల్లు పెట్టి ఇప్పుడే సలహాలు, సూచనలివ్వమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.

బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీష్ మాట్లాడుతూ అర్ధరాత్రి 12గంటల తర్వాతా బిజినెస్ ఎజెండా పెట్టడాన్ని తప్పుబట్టారు. ఇది శాసన సభలో సభ్యుల హక్కులను ఈ సభ ఉల్లంఘిస్తుందని విమర్శించారు. బిల్లుపై కనీసం ఒక రోజు వర్కింగ్ డే ముందే మాకు అమెండ్మెంట్ పంపాలని కోరారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భూ భారతి ప్రాధాన్యతతో కూడిన బిల్లు కావడంతో దీనిపై సభ్యులకు అధ్యయానానికి ఈ రోజు సమయమిచ్చి రేపు బిల్లుపై చర్చ పెట్టాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed