- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ కార్పొరేటర్ల నిరసన..
దిశ, చైతన్యపురి : గత 6 నెలల నుండి ఎల్బీనగర్ జోన్ లోని అన్ని డివిజన్ లలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడంపై జోనల్ కమిషనర్ కార్యాలయం వద్ద బుధవారం బీజేపీ కార్పొరేటర్ లు కమిషనర్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుని ప్లకార్థులతో నిరసన తెలిపారు. ఒక్కో డివిజన్ కు 50 వేల మంది ఓటర్లు ఉన్నారని అభివృద్ధి విషయంలో నిధులు విడుదల చేయకపోవడం వలన ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నట్లు తెలిపారు. అత్యధికంగా పన్నులు కడుతున్నా ప్రజల సమస్యలు తీర్చలేక పోతున్నట్లు వాపోయారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓల్డ్ సిటీ కి అధికనిధులు కేటాయించి మాకు మొండి చేయి చూపిస్తుందని ఆరోపించారు.
బీజేపీ కార్పొరేటర్ లమని మాకు నిధులు కేటాయించడం లేదన్నారు. మా సమస్యలపై జోనల్ కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ మాట్లాడుతూ నా పరిధిలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. నిధులు విడుదల అంశంపై జిహెచ్ఎంసి కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహా రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి, రంగా నర్సింహా గుప్తా, నాయకోటి పవన్ కుమార్, ఆకుల శ్రీవాణి, చింతల అరుణ సురేందర్ నాథ్ యాదవ్, మొద్దు లచ్చి రెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.