Breaking: పరిటాల రవి హత్య కేసులో సంచలనం.. 18 ఏళ్లకు ముద్దాయిలకు బెయిల్

by srinivas |
Breaking: పరిటాల రవి హత్య కేసులో సంచలనం.. 18 ఏళ్లకు ముద్దాయిలకు బెయిల్
X

దిశ, వెబ్ డెస్క్: పరిటాల రవి హత్య కేసు(Paritala Ravi murder case)లో ఐదుగురు ముద్దాయిలకు బెయిల్ మంజూరు(Bail granted) అయింది. ఈ కేసులో 18 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న పండుగ నారాయణరెడ్డి రేఖమయ్య, బజన రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు కొన్ని షరతులు విధించింది. రూ. 25 పూచీకత్తులు స్థానిక మేజిస్ట్రేట్‌లో సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద హాజరుకావాలని సూచించింది. ముద్దాయిలు విడుదల అయిన తర్వాత చెడు ప్రవర్తన ఉంటే బెయిల్ రద్దు చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. ముద్దాయిలు దరఖాస్తు చేసుకుంటే ముందస్తు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రెండు రోజుల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చినా బెయిల్ మంజూరుకు సంబంధించిన కాపీ నేడు అధికారికంగా విడుదల అయింది. కాగా అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్యకు గురయ్యారు. ఈ కేసులో ముద్దాయిలకు ఇన్నాళ్లుకు బెయిల్ మంజూరు అయింది.

Advertisement

Next Story