- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో పంజా విసురుతోన్న చలి.. ఆ జిల్లాలో స్కూళ్ల టైమింగ్స్‌లో మార్పు
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చలి వణికిస్తోంది. చలి పంజా విసురుతోంది. చలికాలం వచ్చిందంటే చాలు అందరూ గజగజ వణికిపోతారు. ఈ క్రమంలో పలు చోట్ల ఎక్కడ చూసిన రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగమంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పొగమంచు అధికంగా ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలోనే కాదు మిట్ట మధ్యాహ్నం కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ(Telangana) జిల్లాలలో చలి ప్రభావం(Effect of cold) ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల(School) వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు స్కూళ్లు నడపాలని ఆదేశించింది. ప్రస్తుతం 9.15 నుంచి సాయంత్రం 4.15 వరకు పాఠశాలలు నడుస్తున్నాయి. కాగా, తాము చలితో ఇబ్బందులు పడుతున్నామని, టైమింగ్స్ మార్చాలని పలు జిల్లాల విద్యార్థులు కోరుతున్నారు.