ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి సుప్రీం కోర్టులో ఊరట..

by Naveena |
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి సుప్రీం కోర్టులో ఊరట..
X

దిశ, ఆర్మూర్: రంగారెడ్డి జిల్లా మోకిలా చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డిపై నమోదైన కేసులో ఆయనకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జీవన్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆ కేసులో విచారణకు పోలీసులకు సహకరించాలని జీవన్ రెడ్డికి సూచించింది. తన భూమిని మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి బలవంతంగా లాక్కున్నారని సామ దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు, ఆయన భార్య రజిత రెడ్డి, తల్లి రాజు బాయిలపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి తమపై నమోదైన కేసులను కొట్టి వేయాలని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు మెట్లు ఎక్కారు. కానీ రాష్ట్ర హైకోర్టు జీవన్ రెడ్డి భార్య రజిత రెడ్డి, తల్లి రాజు భాయి లకు బెయిల్ మంజూరు చేసి, జీవన్ రెడ్డి బెయిల్ కోసం వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ను సంప్రదించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ విల్ పిటిషన్ దాఖలు చేయగా.. సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్ గీ, నిరంజన్ రెడ్డిలు వాడి వేడిగా వాదనలు చేయగా జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మోకిలా పోలీస్ స్టేషన్ కు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి.. సామా దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసు విషయంలో విచారణకు హాజరయ్యారు.

Next Story

Most Viewed