- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెంచికలపేట్ రేంజ్లో నీల్గాయి వేట

దిశ, బెజ్జూర్ : దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ రేంజ్ లోని లోడుపల్లి అటవీ సెక్షన్ పరిధిలో నీల్గాయి (నీలి ఆవు)వేట సాగిందనే సమాచారం మేరకు పెంచికలపేట్ రేంజ్ లోని సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించినట్లు ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్ తెలిపారు. పెంచికలపేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన చాపిడే వెంకటేష్, ఆత్రం రవి, గొర్లపల్లి మొండి, మన్నేపల్లి శ్రీహరి, ఆత్రం భీమయ్య, ఎల్లూరు గ్రామానికి చెందిన దుర్గం రవీందర్ అనే ఆరుగురు నిందితులను గుర్తించినట్టు తెలిపారు.
వీరిలో దుర్గం రవీందర్, చప్పిడి వెంకటేష్ ను అదుపులోని తీసుకొని శుక్రవారం విచారిస్తుండగా మిగతావారు తప్పించుకొని పరారైనట్లు తెలిపారు. తదుపరి కేసు విచారణ జరుగుతుందన్నారు. వీరిలో దుర్గం రవీందర్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ మేరగూడకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈకేసు విచారణలో ఎఫ్ఎస్ఓ శంకర్, ఎఫ్బీఓ లు సంగదీప్, సతీష్, లచ్చన్న, మనోహర్ తోపాటు యానిమల్ ట్రాకర్ సిబ్బంది శ్రీకాంత్, వెంకటేష్ పాల్గొన్నారు.