కేసులు మాఫీ చేయండి సార్..

by Naveena |
కేసులు మాఫీ చేయండి సార్..
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది ఏళ్ల దాటినా,నాటి ఉద్యమ పోలీసు కేసులు మాఫీ కాలేదని తెలంగాణ ఉద్యమకారులు,టిఎన్జీఓల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రా నాయక్,చంద్రకాంత్ రెడ్డి లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011లో జరిగిన సకలజనుల సమ్మెలో..ఆర్టీసీ బస్సులను అడ్డుకుని ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ టూ టవున్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్లతో నమోదైన కేసులపై బుధవారం రెండవసారి 25 మంది ఉద్యమకారులు కోర్టుకు హాజరైన సందర్భంగా వారు మాట్లాడారు. కేసును ప్రముఖ న్యాయవాది,టిపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారన్నారు. కేసులో ఉన్న వారందరూ అనారోగ్యంతో బాధపడుతుండగా..కొందరు మంచానికే పరిమితమైన కోర్టుకు రాలేని పరిస్థితిలో ఉన్నారని వారు విచారం వ్యక్తం చేశారు. తిరిగి మరోమారు జనవరి 31కి వాయిదా వేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేసులను మాఫీ చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story