CPI: విద్యారంగంలో గత ప్రభుత్వం ఫెయిల్.. ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-12-18 13:42:00.0  )
CPI: విద్యారంగంలో గత ప్రభుత్వం ఫెయిల్.. ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం(Previous Government) విద్యారంగాన్ని(Education) సరిదిద్దటంలో ఫెయిల్(Fail) అయ్యిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambashiva Rao) అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) విద్యారంగంపై చర్చ కొనసాగుతోంది. ఇందులో కూనంనేని మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త మెనూ(New Menu) తీసుకొచ్చిందని చెబుతూ.. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆ మెనూను సమర్ధవంతంగా అమలు అయ్యేలా చూడాలని చెప్పారు. భారత ఆరంభశూరత్వం ఉంటుందని, అలా చేయకుండా విద్యార్థులకు మంచి భోజనం అందించాలని సూచించారు. అలాగే చాలా ప్రభుత్వ స్కూళ్లలో భోదన సిబ్బంది సరిగ్గా లేక మూత పడే పరిస్థితి ఏర్పడిందని, ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేసి విద్యార్థుల భవిష్యత్‌కు పాటు పడాలని కోరారు.

అంతేగాక గత ప్రభుత్వం విద్యాలయాలకు బడ్జెట్(Budjet) లో చాలా తక్కువ కేటాయించేదని, ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది కానీ అది కూడా సరిపోదని, కనీసం 12 శాతం కేటాయించాలని సలహా ఇచ్చారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో(Government Schools) సరైన సదుపాయాలు లేక విద్యార్ధులే(Students) గాక టీచర్లు(Teachers) కూడా ఇబ్బందులు పడుతున్నారని, వాటికి తగిన ఏర్పాట్లు చేసి పాఠశాలల్లో ఇబ్బందులను తొలగించాలని చెప్పారు. అలాగే టీచర్లను మానిటరింగ్ చేసేందుకు జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్(IAS Officer) ను నియమించాలని సూచించారు. గురుకులాల్లో(Gurukula) స్కూల్ టైమింగ్స్(School Timings) వల్ల హస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దయచేసి గురుకుల పాఠశాల టైమింగ్స్ మార్చాలని కోరారు. చివరగా విద్యావ్యవస్థలో గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని, ఈ ముఖ్యమంత్రి అలా కాకూడదని కోరుకుంటున్నానని సీపీఐ నేత అన్నారు.

Advertisement

Next Story