Good news: జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

by Prasad Jukanti |
Good news: జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టులకు తమిళనాడు ప్రభుత్వం (Government of Tamil Nadu) తీపి కబురు చెప్పింది. జర్నలిస్ట్ కుటుంబ సహాయ (Journalist's Relief Fund) నిధిని స్టాలిన్ (CM MK Stalin) ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు జర్నలిస్టుల కుటుంబ సహాయ నిధిలో సాయాన్ని పెంచుతూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిబంబంధనల ప్రకారం 20 ఏళ్లు పనిచేసి మరణిస్తే రూ.10 లక్షలు. 15 ఏళ్ల సర్వీసు తర్వాత మరణిస్తే రూ.7.5 లక్షల, సహజ మరణమైతే 5 ఏళ్ల సర్వీసు తర్వాత వారి కుటుంబానికి రూ.2.5 లక్షలు ముఖ్యమంత్రి జనరల్ రిలీఫ్ ఫండ్ నుంచి జర్నలిస్టుల కుటుంబాలకు సర్కార్ అందివ్వనున్నది.

Advertisement

Next Story