డంపింగ్​ యార్డ్​ శిలాఫలకం ధ్వంసం

by Aamani |   ( Updated:2024-12-18 14:25:22.0  )
డంపింగ్​ యార్డ్​ శిలాఫలకం ధ్వంసం
X

దిశ, పరిగి : డీఎస్పీ, ఓ సీఐ, ఐదుగురు ఎస్​ఐలు, పాతిక మందికి పైగా కానిస్టేబుళ్ల బందోబస్తు మధ్య ఏర్పాటు చేసిన శిలాఫలకం పట్టుమని పది రోజులు కూడా ఉంచకుండా పగల గొట్టారు. పరిగి మండలం మాదారం గ్రామ శివారులో పరిగి మున్సిపల్​ కు చెందిన డంపింగ్ యార్డు విషయంలో ఆందోళన, అడ్డగింత, అరెస్టులు మధ్య ఈనెల 3వ తేదీన శిలాఫలకం ఆవిష్కరించారు. మాదారం, నజీరాబాద్​ తండా, రంగాపూర్​ తండా, హనుమాన్​ గండి తండా వాసులంతా వ్యతిరేకిస్తున్నారని తెలుసుకొని చివరి క్షణంలో స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్​ రెడ్డి శంకుస్థాపన చివరి నిమిషంలో విరమించుకున్నారు. సుమారు 23 లక్షలతో నిర్మించ తలపెట్టిన శిలాఫలకాన్ని మున్సిపల్​ కమిషనర్​ వెంకటయ్యతో ఆవిష్కరింపజేశారు ఈ శిలాఫలకం ఏర్పాటు చేశాక కూడా వారం రోజుల పాటు పరిగి పోలీసులు దిమ్మెకు కాపాలా ఏర్పాటు చేశారు. శంకుస్థాపన చేసి పట్టు మని పదిహేను రోజులు కూడా గడవక ముందే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.

Advertisement

Next Story