Koppula Eshwar : కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆటో డ్రైవర్ల జీవితం దుర్భరం : మాజీ మంత్రి కొప్పుల

by Y. Venkata Narasimha Reddy |
Koppula Eshwar : కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆటో డ్రైవర్ల జీవితం దుర్భరం : మాజీ మంత్రి కొప్పుల
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆటో డ్రైవర్ల(Auto drivers) జీవితం దుర్భరంగా మారిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకపోవడంతో ఏడాదిలో 98మంది ఆటోడ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar)ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు గళమెత్తితే మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏం చేసిందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు టాక్స్‌లు రద్దు చేసి ఆటో డ్రైవర్లకు ఆసరాగా నిలిచిందని గుర్తు చేశారు.

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల వృత్తికి ఉరితాడు బిగించిందని, వారి ఉపాధికి గండి కొట్టిందని ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటో డ్రైవర్లు రోజంతా ఆటో తోలితే తిండి ఖర్చుల మందం రాని దుస్థితి ఏర్పడిందని, పిల్లలను సైతం చదివించలేని పరిస్థితుల్లో పడ్దారని, ఈఎంఐలు కట్టకపోవడంతో వాహనాలను ఫైనాన్స్ దారులు లాక్కెళ్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి, వారు ఆత్మహత్యల పాలవుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కి చిత్తశుద్ధి ఉంటే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed