- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదువు అంటే కేవలం బట్టి పట్టడం, ర్యాంకులు తెచ్చుకోవడం కాదు : జయప్రకాష్ నారాయణ్
దిశ, శంషాబాద్ : చదువు అంటే కేవలం బట్టి పట్టడం, ర్యాంకులు తెచ్చుకోవడం కాదని మాజీ ఎమ్మెల్యే, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. జనతా హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ హనుమంత రెడ్డి, డాక్టర్ మేధిని రెడ్డి నిర్వహించిన బేసిక్ లైఫ్ సపోర్ట్ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఎం ఎం ఆర్ గార్డెన్ లో శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి తో కలిసి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సమాజానికి పనికి వచ్చే నైపుణ్యం మన పిల్లలకు అందాలని, ప్రాణాపాయ సమయంలో ప్రాణాలను కాపాడే పనికొచ్చే పని మరి ఇంకొకటి లేదన్నారు. ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను ఈ దేశంలో కోల్పోతున్నారన్నారు. ఉన్నట్టుండి గుండె ఆగిపోవడం, రోడ్డు ప్రమాదంలో సమయానికి వైద్యం అందకపోవడం రకరకాలుగా రోజుకు ఈ దేశంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రతి ఒక్కరికి నైపుణ్యం అవసరమని ఆపద సమయంలో సీపీఆర్ చేసి కూడా ప్రాణాలు కాపాడుతున్నారు. సమయానికి ఆపద వస్తే ఆ సమయంలో డాక్టర్ ఉండరని కొన్ని సందర్భాల్లో ఆస్పత్రికి వెళ్లే లోపే ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి శిక్షణలు ప్రతి కాలేజీలలో, విద్యాసంస్థల్లో ప్రతి విద్యార్థికి ప్రతి యువకుడికి అందాలన్నారు. చదువు అంటే కేవలం బట్టి పట్టడం, కాపీ కొట్టడం, ర్యాంకులు తెచ్చుకోవడం కాదని నైపుణ్యం అవసరమన్నారు.
సమాజానికి పనికి వచ్చే ఇలాంటి శిక్షణలో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడు కోవాలన్నారు. చాలా మేరకు కొద్దిపాటి క్రమశిక్షణ, పరిమితమైన ఆహారం తీసుకోవడం, సరైన సమయంలో నిద్ర పోవడం, అనవసరంగా చికాకులకు గురికాకుండా చేస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలో కెల్లా ఎక్కువ మన భారతదేశంలోని చనిపోతున్నారన్నారు. అత్యధికంగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు నివారణ ఒక ఉద్యమంలో చేపట్టాలన్నారు. యువత కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని ముక్కుపచ్చలారని యువకులు చనిపోతే సమాజానికి నష్టం, ఆ తల్లిదండ్రులకు కూడా శోకము అన్నారు. విద్యార్థులకు యువతకు ఇలాంటి చక్కటి ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ హనుమంత్ రెడ్డి మరియు వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, కేర్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం తదితరులు పాల్గొన్నారు.