- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్..
దిశ, ఇబ్రహీంపట్నం : ఆన్‌లైన్ బెట్టింగ్ లో నష్టపోయి అప్పులబాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని తులేకాలన్ (పెత్తుల్ల) గ్రామానికి చెందిన చెనమోని శివలింగం తండ్రి లక్ష్మయ్య వయస్సు 28సంవత్సరాలు. ఇబ్రహీంపట్నంలో ఐడీఎఫ్సీ బ్యాంక్ కు సంబంధించిన ఫైనాన్స్ లో పని చేస్తాడు.
అయితే గత కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, దీంతో మనస్తాపానికి గురై డిసెంబర్ 15 న డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా లో చేర్పించారు. కాగా డిసెంబర్ 18న బుధవారం రోజు చికిత్స పొందుతూ శివలింగం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.