TG Govt: మండలిలో మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-18 07:51:04.0  )
TG Govt: మండలిలో మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దూపదీప నైవేద్య కార్యక్రమం మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. బుధవారం మంత్రి మండలిలో మాట్లాడుతూ.. నెలకు రూ.4 వేలు దూపదీప నైవేద్యం కోసం, అర్చకుల గౌరవ వేతనం రూ.6 వేలు మొత్తం పది వేలు ఇస్తున్నట్లు తెలిపారు. దూపదీప నైవేద్యం కోసం పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌(BRS) చేసిందేమీ లేదని అన్నారు. వైఎస్‌ హయాంలో రూ.2500 దూపదీప నైవేద్యం కింద 1205 దేవాలయాలను గుర్తించినట్లు తెలిపారు. 2015 వరకు కొనసాగించామని అన్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వం రూ.6 వేలకు పెంచింది. అర్చకులకు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దాదాపు 6,541 దేవాలయాలకు ప్రతినెల రూ.6,27,10,000 పారితోషికం చెల్లిస్తున్నామని అన్నారు.

అర్హత ఉన్న దేవాలయాలకు దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్యాక్రాంతమైన భూములపై ప్రతి జిల్లాలోని దేవాలయాల భూములపై సర్వే చేయాలని ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. రూ20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయాల నుంచి 3 శాతం నిధులు సేకరించి అర్చకుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. బ్రాహ్మణ పరిషత్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయిలో పాలకమండలి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ప్రముఖ దేవాలయాలైన కీసరగుట్ట, వేములవాడ, జోగులాంబ, భద్రాద్రి కొత్తగూడెం, బాసరల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేస్తామని అన్నారు.


Advertisement

Next Story

Most Viewed