SEBI: రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రూ.26 కోట్ల డిమాండ్ నోటీసు పంపిన సెబీ

by S Gopi |
SEBI: రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రూ.26 కోట్ల డిమాండ్ నోటీసు పంపిన సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: నిధుల అక్రమ మళ్లింపులకు సంబంధించిన కేసులో విధించిన జరిమానాలను క్లియర్ చేయడంలో విఫలమైనందుకు రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రూ. 26 కోట్ల జరిమానా చెల్లించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోరింది. నవంబర్ 14 నుంచి పదిహేను రోజులలోపు చెల్లింపులు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. చెల్లింపు విషయంలో విఫలమైతే రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం ఆర్‌బీఈపీ ఎంటర్‌టైన్‌మెంట్) బ్యాంక్ ఖాతాలతో సహా ఆస్తులను అటాచ్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఈ ఏడది ఆగష్టులో సెబీ జరిమానా రూ. 25 కోట్లను చెల్లించడంలో విఫలమైనందున తాజా నోటీసులు జారీ చేసింది. దీనికి వడ్డీ, రికవరీ ఖర్చులతో సహా రూ. 26 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి నిధుల మళ్లింపు ఆరోపణలపై పారిశ్రామికవేత్త అనిల్ అంబానీతో పాటు మరో 24 మందిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. అదనంగా, సెబీ అంబానీపై రూ. 25 కోట్ల జరిమానా విధించింది. ఐదేళ్లపాటు ఏ లిస్టెడ్ కంపెనీ ఎంటిటీలో డైరెక్టర్ లేదా కీ మేనేజర్ పర్సనల్‌గా పనిచేయకుండా నిషేధించింది.

Advertisement

Next Story