- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లింబాద్రిగుట్టపై ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..
దిశ ,ఆర్మూర్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లింబాద్రి గుట్టపై జరిగిన రథయాత్రకు హాజరయ్యారు. దీంతో వేద పండితులు ఆయనకు స్వాగతం పలికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే లింబాద్రిగుట్టపై లక్ష్మీనరసింహ స్వామికి మెుక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పైడికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే రథయాత్రను తాడుతో లాగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వేల సంఖ్యలో జనం జిల్లా నుంచే కాకుండా, ఇతర జిల్లాల నుండి కూడా తండోపతండాలుగా లింబాద్రిగుట్టకు రావడం అనవాయితిగా వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. లింబాద్రిగుట్టకు పూజలు నిర్వహించే భక్తులు ఇబ్బందికి గురికాకుండా ఓపికతో క్యూ లైన్ లలో నిలబడి ప్రత్యేక పూజలు చేయాలన్నారు. భక్తులకు ఆలయ కమిటీ ప్రతినిధులు, పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెంట బిజెపి నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు పెద్దొల్ల గంగారెడ్డి ఉన్నారు.