- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Madras high court : లవర్స్ హగ్, కిస్ చేసుకోవడం నేచురల్.. : మద్రాస్ హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : లవర్స్ హగ్, కిస్ చేసుకోవడం సహజమని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. 19 ఏళ్ల యువతి ఫిర్యాదుతో 21 ఏళ్ల యువకుడిపై నమోదైన కేసును కొట్టివేసింది. ప్రేమలో ఉన్నప్పుడు జంట మధ్య హగ్, కిస్ సహజమని, భారత చట్టం ప్రకారం అది నేరం కాదని తెలిపింది. యువకుడిపై 354-A(1)(i) ప్రకారం నమోదైన కేసు శారీరక సంబంధాలు, అవాంఛనీయ లైంగిక చర్యలకు సంబంధించినది. ఆ యువకుడిపై ఈ సెక్షన్ కింద కేసు పెట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. యుక్తవయసులో ఉన్న ఇద్దరు ప్రేమికులు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం అని, ఇది నేరం కాదని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్ వివరించారు. 2020 నుంచి 2022 నవంబర్ వరకు రిలేషన్‌లో ఉన్న జంటకు సంబంధించిన కేసు ఇది. యువతిని ఓ లొకేషన్‌కు రమ్మని రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గడిపిన సందర్భంలో యువకుడు ఆమె అంగీకారం తీసుకోకుండా హగ్ చేసుకున్నాడని, కిస్ చేశాడన్నది ఆరోపణ. ఈ ఘటన జరగ్గానే విషయాన్ని పేరెంట్స్‌కు చెప్పడంతో పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన అబ్బాయి ముందుంచారు. అందుకు యువకుడు తిరస్కరించడంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.