- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anura Kumara Dissanayake: దిసనాయకేకు జైకొట్టిన శ్రీలంక.. 159 సీట్లు గెలుచుకున్న ఎన్‌పీపీకే
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల(Sri Lanka Parliament Election Results) ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే(Anura Kumara Dissanayake)కు ప్రజలు జైకొట్టారు. ఆయన పార్టీ నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ) పార్టీకే మూడింట రెండువంతుల సీట్లు కట్టబెట్టారు. దీంతో 225 సీట్లున్న పార్లమెంటులో ఎన్‌పీపీ(NPP) 159 స్థానాలు గెలుచుకుందని ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా, ప్రతిపక్షంలోని యునైటెడ్ పీపుల్స్ పవర్ పార్టీ 40 సీట్లకు పరిమితమై రేసులో రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కొత్త పార్టీ నాయకుడు, మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే 42 శాతం ఓట్లు సాధించి అధ్యక్షుడయ్యారు. 50 శాతం ఓట్లు సంపాదించకపోవడంతో ప్రాధాన్యత ఓట్లతో ఆయన అధ్యక్ష పీఠాన్నీ చేపట్టారు. ఎన్నికల్లో ప్రకటించినట్టుగా ఆర్థిక సంస్కరణలు, అవినీతి రాజకీయ నాయకుల నుంచి వసూళ్లు, దేశానికి కొత్త రాజ్యాంగం వంటి హామీలను అమలు చేయడానికి పార్లమెంటులో ఆయన పార్టీ(మూడు సీట్లు)కి మెజార్టీ లేదు. అదీగాక, 50 శాతానికి తక్కువ ఓట్లు సాధించడంతో ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం నైతికంగా అవసరమైంది. అధ్యక్షుడిగా ఎన్నికైన రెండు రోజుల్లోనే పార్లమెంటు రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాడు. సంచలన సంస్కరణలకు ఈ ఎన్నికలతో ప్రజలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది.
మార్క్సిస్టు నేతలపై తమిళుల విశ్వాసం
తమిళులు ఎక్కువగా ఉండే ఉత్తరాది జిల్లా జాఫ్నాను ఎన్‌పీపీ గెలుచుకుంది. ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తమిళపార్టీలే గెలిచాయి. తొలిసారిగా బయటిపార్టీ ఎన్‌పీపీ గెలవడం ఒక కొత్త మార్పును సూచిస్తు్న్నది. సింహళీ నాయకులపై అనుమానంగా చూసే తమిళులు దిసనాయకేపై విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ సారి ఎన్నికల్లోనూ తమిళపార్టీలు కూటమిగా పోటీ చేయకపోవడం గమనార్హం. 1983-2009 వరకు ప్రత్యేక ప్రాంతం కోసం తమిళ రెబల్స్ జరిపిన యుద్ధం విజయం సాధించలేదు. ఇందులో లక్షకు మించి ప్రజలు మరణించినట్టు యూఎన్ అంచనా.