Tirumala News : తిరుమలలో ఘనంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

by M.Rajitha |
Tirumala News : తిరుమలలో ఘనంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమలలో శ్రీవారికి గరుడసేవ(Garudaseva) ఘనంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుత్మంతుని మీద ఆలయ మాడ వీధుల్లో విహరించారు. గరుడి మీద ఊరేగిన వేంకటేశ్వరున్ని దర్శించుకున్న భక్తులు తరించిపోయారు. జ్ఞానవైరాగ్యాన్ని కోరే మానవులు.. జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుత్మంతున్ని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ(TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Advertisement

Next Story