- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trump : నమ్మకస్తులకే ట్రంప్ పదవుల పట్టం.. వ్యాక్సిన్ల వ్యతిరేకికి ఆరోగ్యశాఖ
దిశ, నేషనల్ బ్యూరో : కాబోయే అమెరికా అధ్యక్షుడు(US President) డొనాల్డ్ ట్రంప్(Trump) తన మంత్రిమండలిని రెడీ చేసుకుంటున్నారు. నమ్మకస్తులు, సన్నిహితులను కీలక ప్రభుత్వ బాధ్యతల కోసం ఆయన ఎంపిక చేసుకుంటున్నారు. రాజకీయంగా, కోర్టు కేసులపరంగా ట్రంప్ కష్టకాలాన్ని ఎదుర్కొన్నప్పుడు మేమున్నాం అంటూ వెంట నడిచిన వారిని అవకాశాలు వరిస్తున్నాయి. ఈక్రమంలోనే స్టీఫెన్ మిల్లర్‌ను అమెరికా వైట్‌హౌస్‌లో కీలకమైన ‘డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ’ పదవిలో ట్రంప్ నియమించారు. అమెరికా ప్రభుత్వ విధానాలను ఈ విభాగమే రూపకల్పన చేస్తుంది. అమెరికాలోకి మితిమీరిన విదేశీ వలసలను అనుమతించడం సరికాదని వాదించే అతివాదిగా స్టీఫెన్ మిల్లర్‌కు పేరుంది. ట్రంప్ భావజాలం కూడా అదే. అందుకే ‘డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ’ పదవిని స్టీఫెన్ మిల్లర్‌కు కట్టబెట్టారు. ఈ నియామకాన్ని కాబోయే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ధ్రువీకరించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు వైట్ హౌస్‌లో స్పీచ్ రైటింగ్ విభాగం డైరెక్టర్, సీనియర్ అడ్వైజర్ పదవిలో స్టీఫెన్ మిల్లర్ పనిచేశారు. 2018లో ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ వంటి సంచలన విధాన నిర్ణయాలను ట్రంప్ తీసుకోవడం వెెనుక మిల్లర్ ఉన్నారు. ప్రవాస భారతీయులకు హెచ్-1బీ వీసాల జారీ అంశం కీలకం. ఈ వీసాల జారీని సాధ్యమైనంత మేర తగ్గించాలనేది స్టీఫెన్ మిల్లర్ అభిప్రాయం.
రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్..
అమెరికాలో కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతున్న టైంలో రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ వివాదాస్పద వాదనతో తెరపైకి వచ్చారు. కొవిడ్-19 వ్యాక్సిన్ల వినియోగం సరికాదని ఆనాడు ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు చేదోడుగా రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ నిలిచారు. బైడెన్ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. అందుకే ఈసారి తన ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్యశాఖను ఆయనకు అప్పగించాలని ట్రంప్ నిర్ణయించారు. మాజీ అమెరికా అధ్యక్షుడు కెనడీ రాజకీయ కుటుంబం నుంచి రావడం అనేది రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్‌కు అడ్వాంటేజ్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోగ్) సారధ్య బాధ్యతలను వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్‌లను సంయుక్తంగా ట్రంప్ అప్పగించారు. వీరిద్దరూ అమెరికా బ్యూరోక్రసీలో మార్పులు చేసి, ప్రభుత్వ పాలనా సమర్థతను పెంచుతారు. వృథా ఖర్చులను తగ్గిస్తారు. తులసీ గబార్డ్‌కు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవిని ట్రంప్ అప్పగించారు.