- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amith shah : నాల్గో జెనరేషన్‌తో కూడా అది సాధ్యం కాదు.. అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : మహా వికాస్ అఘాడీ కూటమి టార్గెట్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మీది ఉద్ధవ్ సేన.. అని రియల్ శివసేన బీజేపీతోనే ఉందన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం మహారాష్ట్రలోని యావత్మల్‌లో ఆయన మాట్లాడారు. అయోధ్య రామ మందిర నిర్మాణ అంశాన్ని డైవర్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఆత్మబలిదానం చేసుకున్నాయన్నారు. ‘ఉద్ధవ్ ఠాక్రే ఒక వైపు తమది నిజమైన శివసేన అంటున్నారని ఔరంగబాద్ పేరు శంభాజీ నగర్‌గా మారిస్తే నిజమైన శివసేన వ్యతిరేకిస్తుందా..? అని ప్రశ్నించారు. మోడీ హయాంలోనే అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీలు అయోధ్యలో రామ మందిర వివాద పరిష్కారాన్ని 70 ఏళ్లుగా ఆపారని ఆరోపించారు. ఐదేళ్లలో మోడీ ఈ కేసును గెలిచి భూమి చేయడంతో పాటు మందిరాన్ని నిర్మించారన్నారు.
‘రాహుల్ బాబాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని తీర్మానం చేసింది. 370 ఆర్టికల్‌ను తీసుకురావడం మీతోనే కాదు మీ నాల్గో జెనరేషన్‌తో కూడా సాధ్యం కాదని అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అమలు కానీ హామీలు ఇవ్వొద్దని సొంత పార్టీ సీఎంలకు చెప్పారని గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలేకపోయింది. మోడీ హామీలు పవిత్రమైనవని.. లడ్కీ బహిన్ యోజన కింద చెల్లెల్లకు రూ.2,100, ఉచితంగా రెండు సిలిండర్లు అందజేస్తామన్నారు. మీ ఒక్క ఓటు దేశాన్ని బలోపేతం చేయడంతో పాటు.. రైతుల వికాసానికి తొడ్పడుతుందని షా అన్నారు. మహిళల హక్కులు, గౌరవం పెరుగుతాయన్నారు.