తెలంగాణకు భారీగా పెట్టుబడులు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-27 07:48:25.0  )
తెలంగాణకు భారీగా పెట్టుబడులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రెడీ అయింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామావు న్యూయార్క్ లోని అడ్వెంట్ ఇంటర్నేషన్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డో నాడోతో సమావేశమయ్యారు. ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్ లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ మీటింగ్ లో చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd), అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories)లో మెజార్టీ వాటాలు కొనేందుకు 1750 కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ కంపెనీ నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వాగతించారు.

"హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ నిర్ణయం నాకు సంతోషాన్ని కలిగించింది. అడ్వెంట్ కంపెనీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇతర లాభదాయక పెట్టుబడి అవకాశాలను కంపెనీ అన్వేషిస్తుందన్న నమ్మకం నాకుంది. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed