విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. నేడు పాఠశాలలు బంద్..!

by Anjali |
విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. నేడు పాఠశాలలు బంద్..!
X

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 12 వ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్ని రీఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే స్కూల్స్ ప్రారంభమై దాదాపు 15 రోజులైన ఇంకా కనీసం పుస్తకాలు కూడా పంపిణీ చేయడం లేదు. దీంతో విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నేడు స్కూల్స్ అన్ని మూసివేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. పాఠశాలలు విద్యార్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని తెలుపుతోందని మండిపడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల్ని కల్పించాలని, అంతేకాకుండా ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ల అక్రమ ఫీజులను అరికట్టి.. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, కాగా పాఠశాలల బంద్ కు అందరూ సహకరించాలని ABVP, విద్యార్థుల తరపున విద్యాశాఖను కోరింది. దీంతో పాఠశాల యాజమాన్యాలు నేడు (జూన్ 26)న హాలీడే ప్రకటించాయి.

అలాగే తెలంగాణలో డీఈఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాల విద్య పర్యవేక్షణ ఎలా సాధ్యమో చెప్పాలని ABVP ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలపై సర్కారు చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు యాజామాన్యాలు బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్నాయని.. కాగా పలు పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కోరింది.

Advertisement

Next Story

Most Viewed