Breaking News: గన్ పార్క్ వద్ద హై టెన్షన్.. పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం!

by Satheesh |   ( Updated:2023-03-17 07:59:12.0  )
Breaking News: గన్ పార్క్ వద్ద హై టెన్షన్.. పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీ-బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గన్ పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. బండి సంజయ్ దీక్ష చేపట్టడంతో అక్కడకు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ను దీక్ష ఆపాలని హెచ్చరించిన పోలీసులు.. ఆయను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గో బ్యాక్ అంటూ బీజేపీ శ్రేణుల పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గన్ పార్క్ వద్ద హై టెన్షన్ నెలకొంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story