- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇప్పటికే ఆ ప్రాంతంలో భారీగా పంటనష్టం.. మరో 48 గంటల పాటు వర్ష సూచన
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. యాసంగి పంట చేతికొచ్చే సమయంలోనే పలుచోట్ల రైతులను భారీ వర్షాలు తీవ్రంగా దెబ్బకొట్టాయి. ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు రావడంతో రైతుల దారుణంగా నష్టపోయారు. ప్రస్తుతం రైతులందరూ రోడ్డుకెక్కి తమ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రోడ్డెక్కి నిరసనలు చేయడం ప్రారంభించి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వర్షాల కారణంగా పంటనష్టం ఎక్కువగా డెల్టా ప్రాంతాల్లో జరిగినట్లు అధికారులు గుర్తించారు. ద్రోణి ప్రభావంతో మరికొన్ని రోజుల పాటు ఈ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అక్కడక్క పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని, కాగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటనష్టానికి ఆలస్యమైన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నేటి నుంచి మరో 48 గంటల పాటు వర్ష సూచన ఉందని తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నారు.