నేడు KCR రిట్ పిటిషన్‌పై హై కోర్టులో విచారణ..!

by Anjali |
నేడు KCR రిట్ పిటిషన్‌పై హై కోర్టులో విచారణ..!
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ జ్యుడీషియరీ కమిషన్ ఏర్పాటుపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు (జూన్ 27) తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే విచారించనున్నారు. జిస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని వెల్లడించారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ తెలిపారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కేసీఆర్ ఆరోపించారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగాన్ని మాజీ సీఎం కేసీఆర్ చేర్చారు. ఇందులో కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed