Health: ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష.. ప్రభుత్వాసుపత్రులపై నివేదిక

by Ramesh Goud |
Health: ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష.. ప్రభుత్వాసుపత్రులపై నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఆసుపత్రులలో డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్(Diagnostic Equipment), ఫైర్ సేఫ్టీ(Fire Safety), మెడిసిన్‌(Medicines) పై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Health Minister Damodar Rajanarsimha) ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా(Health Secretary Christina), డీఎంఈ వాణి(DME Vani), టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్(TGMSIDC MD Hemanth) సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆసుపత్రులలో తనిఖీలకు సంబంధించిన నివేదిక(Report)ను మంత్రికి అందజేశారు.

ప్రభుత్వ దవాఖాన్లలో డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్, ఫైర్ సేఫ్టీ, మెడిసిన్‌ తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పది టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను అనుసరిస్తూ ఆరోగ్య శాఖ అధికారులు పది టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రాష్ట్రంలోని పలు హాస్పిటల్స్ ను విజిట్ చేసి తనిఖీలు నిర్వహించాయి. అంతేగాక దీనిపై సమగ్ర నివేదికను తయారు చేశారు. ఈ రోజు జరిగిన సమావేశంలో టాస్క్ ఫోర్స్ బృందాలు మంత్రికి నివేదికను అందజేశారు. అంతేగాక తమ పర్యటనలో గుర్తించిన అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆసుపత్రులలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారుల నుంచి సలహాలు, సూచనలు కోరినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed