- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీచార్జ్.. ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులు.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్-1 అభ్యర్థులను బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించడం, మహిళా అభ్యర్థులను రోడ్లపై ఈడ్చుకెళ్లడం, రోడ్లపై పరిగెత్తించి మరి కొట్టడం కనిపించింది. కాగా ఈ ఘటనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి తీవ్రంగా ఖండించదగినది అని అన్నారు. అలాగే తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఈ విద్యార్థులపై తెలంగాణ పోలీసులు అనవసర హింసకు పాల్పడ్డారని, నిరసనకారులు తీవ్రవాదులు లేదా గూండాలు కాదు, వారు న్యాయం కోరుతూ గ్రూప్-1 ఆశావాదులని గుర్తు చేశారు. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటని, ఇది ప్రజా పాలనకు విరుద్ధంగా ఉందని, కాంగ్రెస్ నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తు రాసుకొచ్చారు.
👉Also Read : BRS: ఇది ప్రజాపాలననా? రౌడీ రాజ్యమా?.. మాజీమంత్రి హరీష్ రావు ట్వీట్