- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao: ఆరు గ్యారంటీల విషయంలో సీఎం రేవంత్ డకౌట్.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీల (Six Guarantees) విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) డకౌట్ అయ్యారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సెటైర్లు వేశారు. ఇవాళ తుర్కయంజాల్ (Turkyanjal)లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో కేసీఆర్ (KCR) తెలంగాణ (Telangana)ను నెంబర్‌వన్‌గా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ (Congress) పాలనలో రాష్ట్రంలో మరో 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీల (Six Guarantees) దందా బంద్ చేసి మూసీ దుకాణాన్ని తెరిచారని ఫైర్ అయ్యారు. నిరుపేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్ చేశారు. పేదోళ్లతో పెట్టుకుని సీఎం రేవంత్ (CM Revanth) హిట్ వికెట్ (Hit Wicket) చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని, ఆరు గ్యారంటీల (Six Guarantees) విషయంలో రేవంత్ డకౌట్ అయ్యారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారని.. అంతిమ విజయం బీఆర్‌దేనని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.