- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGPSC siege: టీజీపీఎస్సీ ముట్టడికి గ్రూప్స్ అభ్యర్థుల పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డీఎస్సీ తో పాటు గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేసి డిసెంబర్‌లో నిర్వహించాలని నిరుద్యోగులు దర్నాలు చేస్తున్న విషయం తెలసిందే. అయితే ప్రభుత్వం మాత్రం పరీక్షలను వాయిదా వేస్తే నిరుద్యోగులు నష్టపోతారని.. వాయిదా వేసే ప్రసక్తే లేదని చెబుతుంది. ఈ క్రమంలోనే గురువారం నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది. దీంతో శుక్రవారం TGPSC ముట్టడించాలని గ్రూప్స్ అభ్యర్థుల పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నలుమూలల నుంచి నిరుద్యోగలు హైదరాబాద్ చేరుకుని రాత్రి వివిధ ప్రాంతాల్లో బస చేశారు. అయితే TGPSC ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురిని ముందస్తు అరెస్ట్ చేయడమే కాకుండా.. టీజీపీఎస్సీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రూప్ 2,3లో పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రూప్-2 డిసెంబర్ వరకు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.