పొలిటికల్ టర్న్ తీసుకున్న గ్రూప్-1 గొడవ

by karthikeya |   ( Updated:2024-10-17 04:42:09.0  )
పొలిటికల్ టర్న్ తీసుకున్న గ్రూప్-1 గొడవ
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 మెయిన్ పరీక్ష రీషెడ్యూల్ చేయాలంటూ అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఆందోళనలు ప్రారంభించారు. వెంటనే జీవో 29ను సవరించి పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందగానే అశోక్‌గనగర్‌కు చేరుకున్న పోలీసులు.. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే ఈ ఆందోళనలతో అశోక్‌నగర్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభ్యర్థులు రోడ్లు బ్లాక్ చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులు అవస్థలు పడ్డారు. కాగా.. ఆందోళనలకు దిగిన అభ్యర్థులను ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవబోతుండడంతో ఈ వ్యవహారం కాస్తా పోలిటికల్ టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవలే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు దొర్లాయంటూ పరీక్షను రద్దు చేయాలని కొంతమంది అభ్యర్థులు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అలాగే పోస్టుల కేటాయింపులో రిజర్వేషన్ల విషయంలోనూ ఇంకొంతమంది న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వెంటనే పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ కోర్టు మాత్రం ఈ పిటిషన్లంటినీ కొట్టి పారేస్తూ మెయిన్స్ పరీక్షకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇలాంటి టైంలో మళ్లీ మెయిన్స్ చుట్టూ గొడవ మొదలు కావడం చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed