Ponnam Prabhakar : ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
Ponnam Prabhakar : ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నో ఏండ్లుగా ఉత్తర తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు పడుతున్న కష్టాలు త్వరలో తీరనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లూ (Elevated corridors) ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పెట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటర్ కారిడార్ రాజీవ్ రహదారితో అనుసంధానం, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్డు (ఎన్ హెచ్ 44) NH 44 త్వరలోనే ప్రారంభం కానుంది. కంటోన్మెంట్ లో భూమి సేకరించిన నేపథ్యంలో ఈక్వాల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కంటోన్మెంట్ అభివృద్ధిలో భాగంగా 303.62 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదల చేసింది’ అని జీవోను ట్వీట్ చేశారు.

Advertisement

Next Story