- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీహెచ్ఎంసీ మేయర్ వీడియోలు మార్ఫింగ్.. వ్యక్తి అరెస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, మంత్రి పొన్నం ప్రభాకర్ ల ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిని వైరల్ చేయడం తో పాటు అవమానించిన వ్యక్తిని శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...పీర్జాదిగూడ ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ వెంకన్న ఎక్స్ వేదిక లో @nijamenayya1 ఖాతాను తెరిచాడు. బోనాల పండుగ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి ఓ తెలుగు సినిమా డైలాగ్, పాటను జత చేసి తప్పుడు ప్రచారాన్ని చేసాడు. ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశాడు. వ్యక్తిగత ప్రతిష్టకు కు భంగం కలిగించడం తో పాటు ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కించపర్చాడు. ఈ పోస్టింగ్ గందరగోళం సృష్టించడం తో పాటు కలవరం రేపింది. నగరం ప్రధమ పౌరురాలి హోదాను కించపరిచే విధంగా వ్యవహారించాడు. ఈ సంఘటన ఫై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేసి నిందితుడు చామకూరి లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి మార్ఫింగ్ చేసిన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. లక్ష్మన్ ను రిమాండ్ కు తరలించారు.