జెన్కో ఏఈ ఫలితాలు రిలీజ్

by M.Rajitha |   ( Updated:2024-08-30 17:03:05.0  )
జెన్కో ఏఈ ఫలితాలు రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జెన్కో పరిధిలో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి గాను నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు జెన్కో సీఎండీ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. జెన్కోలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్స్ విభాగాల్లో 339 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 4న నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా ఈ ఏడాది జూలై 14వ తేదీన కంప్యూటర్ బేస్డ్ పద్ధతిన పరీక్ష నిర్వహించింది. కాగా పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను http://www..tggenco.com వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story